Anvayaa India Help Line Anvayaa USA Help Line Watsapp Icon

అన్వయ ఎల్డర్ కేర్ 10వ వార్షికోత్సవంలో నటుడు బ్రహ్మానందం, జయేష్ రంజన్ ఐఏఎస్ పాల్గొని, వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ ప్రాధాన్యతను వివరించారు.

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు మారుతున్న పరిస్థితుల వల్ల పిల్లలు దూరమవ్వడం బాధాకరమని ప్రముఖ హాస్య నటుడు, పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం అన్నారు. అమీర్పేటలో జరిగిన ‘అన్వయ ఎల్డర్ కేర్’ సంస్థ 10వ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్తున్న యువతకు తమ తల్లిదండ్రుల ఆరోగ్య సంరక్షణ ఒక మానసిక సంఘర్షణగా మారుతోందని, ఇలాంటి తరుణంలో ‘అన్వయ’ వంటి సంస్థలు వృద్ధులను ఆదుకుంటూ సేవలు అందించడం శుభపరిణామన్నారు.