Anvayaa Kin Care : భారతదేశంలో వయోధికుల (వృద్ధుల) సంరక్షణే ధ్యేయంగా సేవలందిస్తున్న ప్రముఖ సేవా సంస్థ ‘అన్వయా కిన్ కేర్’ (Anvayaa Kin Care) తన 10 ఏళ్ల మైలురాయిని పురస్కరించుకుని ‘కృతజ్ఞ’ పేరుతో దశమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది.
ఫుడ్ డెలివరీ, ఈ-కామర్స్ స్టార్టప్‌ల వేళ వృద్ధుల గృహ సంరక్షణను సవాలుగా తీసుకున్న సంస్థ వ్యవస్థాపకుడు ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో అన్వయా నేడు 38 నగరాల్లో 1.5 లక్షల మందికి పైగా వయోవృద్ధులకు ఆసరాగా నిలిచింది.